25-08-2025 12:26:55 AM
మహబూబాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): గతం గతః.. ఇకనుంచి విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా స్థానిక పోరుకు అధికారపక్షంతో తలపడేందుకు ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ నేతలు ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బేతమల్ల చంద్రయ్య అధ్యక్షతన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు ఇకనుంచి విభేదాలను పూర్తిగా పక్కనబెట్టి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలని తీర్మానించారు. పార్టీ లైన్ తప్పకుండా ముందుకు సాగితే తప్ప, అధికార కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో అడ్డుకునే పరిస్థితి ఉండదని, ఇనుగుర్తిలో బిఆర్‌ఎస్ గత వైభవాన్ని తిరిగి నిలబెట్టేందుకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొబ్బిలి మహేందర్ రెడ్డి, మాజీ సర్పం దార్ల రామ్మూర్తి, గండు నాగన్న, పింగళి శ్రీను, బొబ్బిలి మల్లారెడ్డి, వెంకన్న, మాజీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.