25-08-2025 12:25:09 AM
ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, ఆగస్టు24 : కష్టంగా కాకుండా ఇష్టపడి చదివినట్టే విజయాలు సాధించవచ్చని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం కట్టంగూరు మండలంలోని ఐటిపాముల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో రూ. 120.00 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భోజనశాల & వంటశాల భవనము నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో విధ్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. పాఠశాలగ్రౌండ్, ప్రహరి గోడ పెంచి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచి విద్యార్థులకు పోషకాహారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు.
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు ఎంచుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజకుమార్ ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు నాయకులు మాద యాదగిరి , సుంకర బోయిన నరసింహ , చౌగొని శ్రీనివాస్ గౌడ్ ,పెద్ది సుక్కయ్య, పన్నాల రాఘవరెడ్డి, గద్దపాటి దానయ్య, మిట్టపల్లి శివ ముక్కామల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.