calender_icon.png 7 October, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన ఉండాలి

07-10-2025 12:00:00 AM

  1. రైతుల సందేహాలను నివృత్తి చేయాలి
  2. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్

ఆదిలాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాం తి): కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) ద్వారా పత్తి రైతుల ప్రయోజ నాల కోసం జారీ చేయబడిన కనీస మద్దతు ధర ప్రయోజనాలను పొందడానికి పత్తి రైతులందరికీ ‘కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సంబం ధిత శాఖ అధికారుల ఆదేశించారు. దీనిపై సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో పూర్తిగా అవగాహన చేసుకొని, రైతులకు సహయ సహకా రాలు అందించాలని సూచించారు.

వ్యవసా య మార్కెటింగ్ శాఖ ఆద్వర్యంలో సోమవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని వ్యవ సాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు కపా స్ కిసాన్ యాప్  ద్వారా స్లాట్ బుకింగ్, కౌలు రైతుల రిజిస్ట్రేషన్ చేయుట పై అవగాహన, శిక్షణా కార్యక్రమం  రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం లో ఏర్పాటు చేసారం దీనికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారి పద్మావతి కాపాస్ కిసాన్ మొబైల్ యాప్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 

2025- పంట సంవత్సరంలో మద్దతు ధర క్రింద సీసీఐ కి పత్తి అమ్మడానికి, గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ‘కపాస్ కిసాన్‘ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సందేహాలకు, సలహాలకు రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 18005995779 కు కాల్ చేయాలనీ సూచించారు. ఈ ఏడాది పంట విక్రయానికి సంబంధించి మార్పులు, చేర్పులు చేయడం జరిగిందని, పత్తి కొనుగోలుకు సీసీఐ కొత్త నిబంధనలను ఏర్పాటు చేసిందని, రైతుల వివరాలు, స్లాట్ బుకింగ్  చేసుకోవలసి ఉన్నందున ఈ నిబంధనల వల్ల రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆన్నారు.

పత్తి కొనుగోళ్లలో అక్రమాలను నివారించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త విధానంతో ఈ సీజన్ లో రైతులు పంట అమ్ముకునేందుకు రైతు తన పేరు, జండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అడ్రస్, ఆధార్, మెుబైల్ నంబర్, అడ్రస్ తో కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్టర్ అవ్వాలన్నారు. అనంతరం ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఆ వివరాలు ఎంటర్ చేయాలని, భూమి సొంతమా, కౌలుదారా , పట్టాదారు పాస్ బుక్ నెంబర్, సర్వే నెంబర్, కొలత రకం, రైతుకు ఉన్న మెుత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం లాంటి వివరాలు ఇవ్వాలన్నారు.

రైతు ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. వీటన్నింటితో కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేయాలి. మార్కెట్, తేదీ, టైమ్లోనే రైతుకు సంబంధించిన పత్తి కొనుగోళ్లను అనుమతి, సెంటర్ల వద్ద రైతులు వెయిట్ చేయాల్సిన పరిస్థతి తప్పుతుందన్నారు. స్మార్ట్‌ఫోన్, వ్యవసా య అధికారుల వద్ద స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశం అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, మార్కెటింగ్ అధికారి గజానంద్,  వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.