గ్రామ పాలనపై అవగాహన కలిగి ఉండాలి
చిట్యాల,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ పాలనపై వార్డు సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని దానికి ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని డిపిఓ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం చిట్యాల మండలంలోని 9 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు మొదటి విడతలో భాగంగా నేటి నుండి 20 వరకు నిర్వహించనున్న ఉరుమడ్ల లోని శిక్షణ తరగతుల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన గ్రామ వార్డు మెంబర్లకు గ్రామ అభివృద్ధి, గ్రామానికి వచ్చే నిధులు, వాటి వినియోగం, పాలకవర్గాల పాత్ర అనే అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కోటేష్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకన్న సర్పంచ్ సాగర్ల భాను శ్రీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




