20-05-2025 12:00:00 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 19(విజయ క్రాంతి): పదోన్నతి పొందిన ఏఎస్‌ఐలు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మీర్ ఉస్మాన్ అలీ, కౌటల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాబాజీ ఏ ఎస్ ఐ గా పదోన్నతి పొందగా ఎస్పీ డివి శ్రీనివాస రావు సోమవారం జిల్లా కేంద్రంలోని డిపీఓ కార్యాలయంలో ఇద్దరినీ సన్మానించి స్టార్ ను తొడిగారు పదోన్నతి తో పాటు బాధ్యత పెరుగుతోందని భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఎం.టి.ఓ అంజన్న తదితరులు ఉన్నారు.
ప్రజారక్షణకే పోలీసులు..
ప్రజల రక్షణకే పోలీసులు కృషి చేయడం జరుగుతుందని ఎస్పి డివీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డిపీఓ లో జిల్లాలోని ప్రజల నుండి ప్రజావాణిలో భాగంగా అర్జీలు స్వీకరించారు.ఈ సం దర్భంగా ప్రజలు అందజేసిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు.
వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో అనవసర విషయాలను, రాజకీయ నాయకుల,కుల మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను,ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్ చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.