calender_icon.png 20 May, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తిరంగా యాత్ర...

19-05-2025 11:04:21 PM

బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు..

హనుమకొండ (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) విజయవంతమైన సందర్భంగా సోమవారం హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రాజకీయాలకతీతంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. జాతీయ పథకాలతో ర్యాలీ నిర్వహించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్తినేని ధర్మారావు, బిజెపి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మలు మాట్లాడుతూ... భారతదేశంలో టెర్రరిజాన్ని అందం చేయాలని పిలుపునిచ్చారు.

భారత సైనికులు సాహసోపేతంగా ఆపరేషన్ సింధూరం నిర్వహించాలని, సైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ టి. రాజేశ్వరరావు, డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, కార్పొరేటర్లు దాస్యం అభినవ్ భాస్కర్, చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, బిజెపి నాయకులు నాగపురి వెంకటేష్, చింతల రఘుపతి, బింగి శ్రీనివాస్, అల్లం మల్లికార్జునరావు, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.