06-10-2025 07:49:29 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూర్ ఎంపీటీసీ బీసీలకు రిజర్వేషన్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముస్తఫా పోటీ చేస్తున్నట్టు సమాచారం. కోకట్ గ్రామానికి చెందిన ముస్తఫా గతంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సభ్యుడుగా ఉన్న సమయంలో మండలంలో రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న ముస్తఫాను టిఆర్ఎస్ అధిష్టానం సైతం అతడినే పోటీలో ఉండేటట్టు మోగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అతని తండ్రి విటల్ రెడ్డిలతో ఆత్మీయంగా ఉండడంతో వారి అండదండలు కూడా ముస్తఫా పై ఉన్నట్లు తెలిసింది.