calender_icon.png 7 August, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా ప్రచారం.. గేమింగ్ యాప్‌కే

07-08-2025 01:10:32 AM

ఈడీ ఎదుట హీరో విజయ్

హైదరాబాద్, సిటీబ్యూరో అగస్టు 6 (విజయక్రాంతి) : బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. బుదవారం ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న విజయ్‌ను, అధికారులు సుమారు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.

ప్రచారం కోసం అందుకున్న పారితోషికం, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, తాను ప్రచారం చేసింది గేమింగ్ యాప్ కోసమేనని, బెట్టింగ్ యాప్‌కు కాదని స్పష్టంచేశారు. ‘కొన్ని గేమింగ్ యాప్‌లు చట్టబద్ధమైనవి. గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు చాలా తేడా ఉంది. నేను ప్రచారం చేసిన ‘ఏ23’ యాప్‌కు జియో-లొకేషన్ లాక్ ఉంటుంది.

తెలంగాణ వంటి రాష్ట్రాల్లో.. ఎక్కడైతే ఈ యాప్‌పై నిషేధం ఉందో అక్కడ అది ఓపెన్ కాదు,’ అని ఆయన వివరించారు. ‘నేను గేమింగ్ యాప్ కోసం ప్రచారం చేశా. కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్ధమైనవి. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్‌కు తేడా ఉంది. ఈడీ నన్ను అడిగిన అకౌంట్, కంపెనీ, లావాదేవీల వివరాలన్నీ ఇచ్చాను. నేను చెప్పిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది చెప్పేందుకు కోర్టులు, ప్రభుత్వాలున్నాయి,’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

వరుసగా టాలీవుడ్ ప్రముఖులు..

ఈ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసిం ది. ఇప్పటికే జూలై 30న నటుడు ప్రకాష్‌రాజ్‌ను విచారించిన అధికారులు, ఇకపై ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయనని ఆయన నుంచి హామీ తీసుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ విచారణ పూర్తి కాగా, ఈనెల 11న నటుడు రానా దగ్గు బాటి, 13న నటి మంచు లక్ష్మిని కూడా ఈడీ విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచా రం చేశారన్న ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో సుమారు 29మంది సినీ, సోషల్ మీడియా ప్రముఖుల పేర్లు ఉన్నాయి. విజయ్, రానా, ప్రకాష్ రా జ్, మంచులక్ష్మితో పాటు నిధి అగర్వాల్, శ్రీముఖి, సిరి హనుమంతు, శోభాశెట్టి, హర్షసాయి, టేస్టీ తేజ వంటి పలువురు నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను చేర్చారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేసి పీఎంఎల్‌ఏ కింద ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతో ంది. వరుసగా సినీ ప్రముఖులను విచారిస్తుండట ంతో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది.