calender_icon.png 11 July, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య,వైద్యం కోసం అప్పులపాలు కావొద్దనే నా తపన..!

11-07-2025 12:21:59 AM

- ఏడాదిలోనే వెయ్యి కోట్లకు పైగా నిధులు. 

- నాకు స్వార్ధ రాజకీయాలక్కర్లేదు. 

- నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్ జులై 10 (విజయక్రాంతి); ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు విద్యా వైద్యం పొందడం కోసం ఆస్తులు తాకట్టు పెడుతూ అప్పుల పాలవుతున్నారని ఆ దుస్థితి నిరుపేదలకు రావద్దన్న లక్ష్యంతోనే నాగర్ కర్నూల్ నియోజ కవర్గంలో విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు.

నేడు మెడికల్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం, మెడికల్ ఆసుపత్రి, తూర్పుర్తిలో ప్రాథమిక ఆసుపత్రి నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరుకానున్న నేపథ్యంలో గురువారం మెడికల్ కళాశాల భవనం సందర్శించి అక్కడే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని నియోజకవర్గానికి విద్యా వైద్య రంగాలపై అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వె య్యి కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ప్ర భుత్వ జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ల్, ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణాలు, అంగన్వాడి భవన నిర్మాణం కోసం నిధులు తీసుకురావడంతో పాటు మెడికల్ ఆసుపత్రి అభివృద్ధి కోసం 235 కోట్లు నిధులు తీసుకొచ్చిన ట్లు తెలిపారు. దీంతోపాటు ప్రజా రవాణ మెరుగుపరిచేందుకు పట్టణ ప్రాంతాలకు మెరుగైన రోడ్ల కోసం నిధులు సమ కూర్చినట్లు తెలిపారు. నిరుపేదలు తమ పిల్లల విద్యా వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారని వాటిని అధిగమించేందుకే ఉచిత విద్య వైద్యం అందేలా తన ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

చేయని పనులకు కూడా ప్రచారం చేసుకునే అలవాటు తనకు లేదని రాజకీయ లబ్ధి కోసం ప్రచార ఆర్భాటాలు తనకు అక్కర్లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవఖానాలను మెరుగుపరిచేందుకు ఖచ్చితమైన ప్రణాళికను రూ పొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనిస్తూ ప్రజలు కూడా సహకరించాలని పేర్కొ న్నారు. వారితోపాటు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, కాంగ్రెస్ నేతలు వెంట ఉన్నారు.మంత్రుల పర్యటనకు ఏర్పా ట్లు సిద్ధం చేసిన అధికారులు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లుపూర్తిచేశారు.