05-09-2025 12:00:00 AM
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. స్టార్ హీరో మనోజ్ మంచు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా పాత్రలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న సందర్భంగా మనోజ్ మంచు విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘మిరాయ్’ కథ మా ఇద్దరి (కథానాయకుడు, ప్రతినాయ కుడు) పాత్రల గురించే ఉంటుంది. కార్తిక్ చెప్పిన కథ చాలా నచ్చింది. శ్రీరాముల వారి నేపథ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్‌డ్రాప్, ఇతిహాసాల కోణం చాలా అద్భుతంగా ఉంటుంది. నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. లేజీగా ఉండేవాడు బతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
ఇందులో నా క్యారెక్టర్ మోడరన్ రావణ -అనుకోవచ్చు. కానీ ఆడవారి జోలికి వెళ్లడు. (నవ్వుతూ). నాకు చిన్నప్పట్నుంచి మార్షల్ ఆర్ట్స్ అలవాటు. అయినా ఈ సిని మాలో యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. దాదాపు 8 నెలల ప్రాక్టీస్ చేశా. నా కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది.
నేను చేస్తున్న కొత్త సినిమాల్లో ‘-డేవిడ్ రెడ్డి’, ‘రక్షక్’ ప్రధానమైనవి. ఈ రెండు కూడా హై ఇంటర్సిటీ యాక్షన్ ఉన్న సినిమాలు. ‘డేవిడ్ రెడ్డి’ వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. అలాగే ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న స్క్రిప్ట్ కోసం కూడా చూస్తున్నా. -తమిళ్ నుంచి కూడా కొన్ని కథలు వస్తున్నాయి. ‘-అహం బ్రహ్మస్మి’ సినిమా కూడా సమయం వచ్చినప్పుడు వస్తుంది. ‘వాట్ ద ఫిష్’ కూడా చేయాలి.. చాలా డార్క్ కామెడీ ఉన్న సినిమా అది. దాన్ని ఫారిన్ లొకేషన్స్‌లో వింటర్, సమ్మర్ రెండు సీజన్లలో తీయాలి. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా అద్భుతమే. ‘-నేను మీకు తెలుసా’ టీమ్‌తో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది.