calender_icon.png 6 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మదరాసిలో మ్యాడ్‌నెస్ యాక్షన్‌క్రేజీగా ఉంటుంది

05-09-2025 12:00:00 AM

శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు లాంటి పెద్ద స్టార్స్‌ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్. చాలా కూల్‌గా ఉంటారు. చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా షూటింగ్ అంతా చాలా పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. 

కథ చాలా కొత్తగా ఉంటుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఎమోషన్, యాక్షన్, కాన్వాస్ పరంగా బిగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. యాక్షన్‌లో మ్యాడ్ నెస్ ఉంటుంది.  

ఈ సినిమాలో లవ్, యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం రుక్మిణి వసంత్. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం. కథకు ఎమోషన్ యాడ్ చేసే రోల్ అది. తన పెర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్ ఎసెట్.

ఈ సినిమాలో మరో రెండు పిల్లర్స్ విలన్ విద్యుత్ జమ్వాల్, బీజు మీనన్. విద్యుత్ జమ్వాల్‌తో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. -బీజు మీనన్ అద్భుతమైన యాక్టర్. వాయిస్ మ్యాడులేషన్‌తో ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో ఆయన్ని దగ్గరుండి గమనించే అవకాశం దొరికింది.