29-07-2025 01:30:05 PM
భక్తులతో శివాలయాల్లో సందడి
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): శ్రావణమాసం నాగ పంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు పుణ్య స్థానాలు ఆచరించి మంగళవారం ఉదయమే శివాలయాలకు తరలి పూజలు చేశారు. నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలోని శివాలయం, శ్రీ కోదండ రామాలయం భక్తులతో సందడి నెలకొంది. మాదారం ఎస్సై సౌజన్య శివాలయంలో నాగదేవతకు పాలు పోసి పూజలు చేశారు. నాగ పంచమి పురస్కరించుకొని కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులు 108 హనుమాన్ చాలీసా పరాయణం, 108 ఆలయ ప్రదక్షిణలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని గర్భగుడిలో మహిళలు శివుడికి ప్రత్యేక పూజలు జరిపారు.