29-07-2025 01:35:22 PM
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలైంది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య తాజాగా వివాదం చోటు చేసుకుంది. ఈ రోజు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడానికి వీరిద్దరితో పాటు ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లాల్సి ఉంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం వీరు ఉదయం 9 గంటలకు వీరు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ 9 గంటల్లోగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 గంటలు దాటినా అక్కడికి రాలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను 9 గంటలకు రమ్మని.. ఉత్తమ్ 10 దాటినా ఇంకా రాకపోవడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అలిగి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారు.
కోమటిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత బేగంపేట ఎయిర్పో్ర్ట్ వద్దకు వచ్చారు ఉత్తమ్. అనంతరం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లారు. నాగార్జునసాగర్ చేరుకున్న మంత్రులు మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు