calender_icon.png 21 January, 2026 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం దృష్టికి నాగర్‌దొడ్డి సమస్యలు

18-09-2024 12:47:42 AM

పరిష్కారానికి కృషి చేస్తాం

జడ్పీ చైర్‌పర్సన్ సరిత

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 1౭ (విజయక్రాంతి): మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామ ప్రజల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత గ్రామస్థులకు హామీ ఇచ్చారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్‌దొడ్డిలో నిర్మించిన నాగర్‌దొడ్డి రిజర్వాయర్‌కు ఇటీవల వరద పెరగడంతో ఇండ్లల్లోకి నీరు వస్తుందని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం సరిత గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.