calender_icon.png 21 January, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్

21-01-2026 02:27:35 PM

హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టేందుకు తెలంగాణ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే.. ఇకపై రాష్ట్ర పోలీసు శాఖ వారి ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందని సీబీఐ చీఫ్ చారు సిన్హా తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని, ప్రజల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, ఫోన్ లోనే సమాచారం అందిస్తే పోలీసులే ఇంటికి వస్తారని ఆమె చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ప్రారంభించామని చారు సిన్హా వెల్లడించారు.