నానో డీఏపీతో రైతులకు మేలు
వ్యవసాయ శాస్త్రవేత్త సాయి పల్లవి
కొమురవెల్లి, జూన్ 18: నానో డిఏపీతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి, పంట దిగుబడి పెరుగుతుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త సాయి పల్లవి సూచించారు. మండల కేంద్రంలోగల రైతు వేదికలో నానో డి ఏ పీ వాడకంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంపై రైతుల ఆలోచన విధానం మారాలని అధికంగా రసాయన ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందని ఆ లోచించడం మానుకోవాలన్నారు. జీవ రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన పంటలు పం డుతాయి అన్నారు. జీవ రసాయన ఎరువు ల వల్ల భూమిలో ఉన్న బాస్వరాన్ని తగ్గించవచ్చు అని అన్నారు. పంటలు వేసేముందు జీలుగా, జనుము లాంటి పంటలువేసి వాటిని భూమిలోనే కలియదున్నాలన్నారు.
కొమురవెల్లి, చేర్యాల,మద్దూరు మండలాలలోని రైతులు అధికంగా భాస్వరాన్ని వాడడం వల్ల భూమిలో బాస్వరం నిల్వలు పెరిగాయని తమ పరిశోధనలు తేలిందని, దానికి పరిష్కారం నానో డి ఎ పి వాడడం వల్ల కొంతమేరకు తగ్గించవచ్చు అన్నారు. అనంతరం ఏ డి ఏ రాధిక మాట్లాడుతూ నానో డిఏపి పురుగుల మందుతో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు అని తెలిపారు. నానో డిఏపి పై కొన్ని సంవత్సరాలు పరిశోధన జరిగాయని, పరిశోధనలో ఫలితాలు బాగున్నాయి కాబట్టే, రైతులకు వాడుకోవాలని సూచించడం జరుగుతుందన్నారు. మొక్కజొన్న, వరి పంటలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో ఏవో వెంకట్రావమ్మ కోర మండల్ కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






