15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

‘నారద పురాణ’ కరపత్రం ఆవిష్కరణ

28-06-2025 12:00 AM

జగిత్యాల, జూన్ 27 (విజయక్రాంతి): సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో జూలై 4 శుక్రవారం నుండి జూలై 10 గురువారం వరకు జరుగనున్న ’శ్రీ నారద మహాపురాణ’ ప్రవచన కరపత్రాన్ని వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు.

శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మచే జరిగే అష్టాదశ మహా పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3వ కార్యక్రమంగా శ్రీ నారద మహా పురాణ ప్రవచనం ఏర్పాటు చేశారు. కోరుట్లతో పాటూ పరిసర ప్రాంతాల ఆధ్యాత్మిక బంధువు లు ఈ ప్రవచనంలో పాల్గొని తరించాలని సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

వేదవ్యాస మహర్షి మానవ జాతికి అందించిన అద్భుత జ్ఞాన మణులు మన ’అష్టాదశ మహా పురాణాల’ని, ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని ధార్మిక బంధువులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు వొటారి చిన్న రా జన్న, మంచాల రాజలింగం, చలిగంటి వినోద్ కుమార్, శక్కరి వెంకటేశ్వర్, పిన్నంశెట్టి భానుమూర్తి, భోగ శ్రీధర్, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.