calender_icon.png 6 July, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ మెడల్‌ని సాధించిన జిల్లా కానిస్టేబుల్

04-07-2025 01:06:07 AM

జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణం, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 3 (విజయ క్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో నిర్వహిస్తున్న వరల్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్- 2025 లో జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మొహమ్మద్ బాబా పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించడం రాష్ట్రం,  జిల్లా పోలీస్ శాఖ గర్వించదగిన విషయమని జిల్లా ఎస్పీ ఎమ్. రాజేష్ చంద్ర మొహమ్మద్ బాబాను అభినందించారు.

పోలీస్ శాఖలో ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్ మొహమ్మద్ బాబా ఐజిపి స్పోరట్స్, హైదరాబాద్లో అటాచ్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. షాట్పుట్  ట్రాక్ అండ్ ఫీల్ 35 సంవత్సరాల వయో వర్గం లో మన రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మెడల్ సాధించడం పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం మొహమ్మద్ బాబాకు అభినందనలు తెలిపారు.