calender_icon.png 11 May, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బంజారాహిల్స్‌లో నరసింహస్వామి జయంతి

10-05-2025 12:14:00 AM

-హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొండపై ఉన్న పురాతన హరేకృష్ణ స్వర్ణ దేవాలయం లో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవా న్ని ఈ నెల 11న జరుపుతున్నామని, అందు కు ఏర్పాట్లు జరుగుతున్నాయని హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్(ఎంటెక్, ఐఐటీ చెన్నై) శుక్ర వారం తెలిపారు.

భక్తులందరికీ రోజంతా ఝులన్ సేవలో పాల్గొనే ప్రత్యేక అవకాశం కల్పిస్తామన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు శక్తివంతమైన నరసింహ మంత్రాలను జపిం చడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉం టుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం, సాయంత్రం స్వామివారికి 108 కలశ మహా అభిషేకం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని సత్యగౌర చంద్రదాస్ కోరారు.