20-01-2026 12:00:00 AM
తెలంగాణలో 10 విద్యాసంస్థలు ప్రారంభం
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత చేరువ చేస్తూ, ప్రముఖ విద్యాసంస్థ ’నారాయణ’ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 10 కొత్త క్యాంపస్లను ప్రారంభించింది. ఇందులో 5 జూనియర్ కళాశాలలు, 5 పాఠశాలలు ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డిలలో ఈ నూతన క్యాంపస్లను ప్రారం భించింది. ఈ విస్తరణతో తెలంగాణలో నారాయణ విద్యాసంస్థల మొత్తం క్యాంపస్ల సంఖ్య 244కు చేరుకుంది.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా 9 కొత్త క్యాంపస్‌లు ప్రారంభమయ్యాయి. ఇందులో 5 పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి (రెండు కళాశాలల్లో హాస్టల్ సదుపాయం కలదు). నిజామాబాద్‌లో ఒక పాఠ శాల, ఒక జూనియర్ కళా శాల ప్రారంభించబడ్డాయి. హాస్టల్ సదుపాయంతో ప్రారంభమైన పాఠశాల సీబీఎస్‌ఈ సిలబస్‌ను అంది స్తుంది. సంగారెడ్డిలో కొత్త జూనియర్ కళాశాల ఏర్పాటైంది. కొత్తగా ప్రారంభించిన క్యాంపస్లలో నిజామాబాద్‌లో ని పాఠశాల మినహా, మిగిలిన అన్ని క్యాంపస్‌లు స్టేట్ బోర్డ్ సిలబస్‌ను అనుసరిస్తాయి.
ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల ప్రెసిడెంట్ పునీత్ కొత్తప మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నారాయణ క్యాంపస్ ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో కీలకమని నారాయణ భావిస్తోందన్నారు. అందుకే ప్రతి ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య ను చేరువ చేస్తున్నట్లు తెలిపారు.