calender_icon.png 12 September, 2024 | 11:58 PM

బయోటెక్ కంపెనీలో వాటా కొన్న నాట్కో ఫార్మా

05-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 4: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాట్కో ఫార్మా తాజాగా కెనడాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ఈ జెనిసిస్ ఇంక్‌లో వాటాను కొన్నది. తమ కెనడా సబ్సిడరీ 4 కోట్ల ఈ జెనిసిస్ షేర్లను కొనుగోలు చేసినట్టు నాట్కో ఫార్మా తెలిపింది. ఇం దుకు 8 మిలియన్ డాలర్లు (రూ.67 కోట్లు) పెట్టుబడి చేసింది. ట్రాన్స్‌ప్లాం ట్ కోసం సురక్షితమైన, సమర్థవంతమైన హ్యుమన్ ఆర్గాన్స్‌ను అభివృద్ధి పర్చడంలో ఈ జెనిసిస్ నిమగ్నమై ఉన్నదని నాట్కో వివరించింది.