2 June, 2026 | 12:48 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్   •   గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి   •   సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్   •   సఫాయి కార్మికులకు ఘన సన్మానం..   •   పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •  

నాథన్ ఎల్లిస్ సంచలన స్పెల్

12-02-2026 12:49 AM

ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం

కొలంబో, ఫిబ్రవరి 11 : టీ20 ప్రపంచకప్ లో అందరికంటే ఆలస్యంగా  మొదటి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా తమ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ లో ఇంగ్లీస్ , రెన్షా , స్టోయినిస్ మెరుపులు.. బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్ సంచలన స్పెల్, ఆడమ్ జంపా స్పిన్ మ్యాజిక్ ఆసీస్‌కు అద్భుత విజయాన్ని అందించాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, మాక్స్ వెల్ నిరాశపరిచినా మిగిలిన బ్యాటర్లు రాణించారు.

స్టోయినిస్ 45, ఇంగ్లీస్ 37,రెన్షా 37 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ స్కోరు 200 లోపే పరిమితమైంది. ఛేజింగ్‌లో ఐర్లాండ్ ను ఆసీస్ బౌలర్లు కంగారెత్తించారు. నాథన్ ఎల్లిస్ అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. ఫలితంగా ఐర్లాండ్ కేవలం 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. జార్జ్ టాక్రెల్ 41, కీపర్ టక్కర్ 24 తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు.

వీరిద్దరూ పోరాడడంతో ఐర్లాండ్ స్కోరు కనీసం 100 పరుగులు దాటగలిగింది.నాథన్ ఎల్లిస్ కేవలం 3.5 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ 115 పరుగులకే ఆలౌటైంది. టీ ట్వంటీ ప్రపంచకప్‌లో 4 వికెట్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదో బౌలర్‌గా నాథన్ ఎల్లిస్ రికార్డులకెక్కాడు.