calender_icon.png 17 May, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ డే

16-05-2025 06:16:06 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ డే సందర్భంగా ర్వాలి అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీ.వినయ్ కుమార్ మాట్లాడుతూ... డెంగ్యూ నివారించండి - నీటి నిల్వను పరిశీలించండి, పరిశుభ్రత పరచండి తొలగించండి అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు, అరోగ్య సిబ్బందికి సూచించారు. 

డెంగ్యూ వైరస్ వ్యాధిని హాని కలిగించే ఎడిస్ ఇజాప్ట్టై (టైగర్)దోమ మన ఇంటి పరిసరాలలో చిన్న చిన్న పాత్రలలో స్థావరం ఏర్పాటు చేసుకొని పగటి పూట కుట్టడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒక సారి ఇంటి పరిసరాల్లో లార్వా ( తొక పురుగులు) లేకుండా చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ బీ.జయమ్మ ఏఎన్ఎంలు పద్మ ఆశాలు జ్యోతి రమణ నర్సింగ్ ఆఫీసర్ సునీత  ఫార్మసిస్ట్ శాంతయ్య ,అరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.