calender_icon.png 17 May, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహితీవేత్త ఇమ్మడి రాంబాబు కు ఉత్తమ ప్రశంసా పత్రం

16-05-2025 06:10:50 PM

తొర్రూరు: తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన పహల్గాం కవితల సంకలనం పుస్తకావిష్కరణ హైదరాబాదులోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన కవితల్లో తొర్రూరు డివిజన్ చెందిన సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబు రచించిన ఐక్యతను చాటుదాం ఉగ్రవాదని తుదముట్టిద్దాం ఉత్తమ కవితగా ప్రకటించారు.

నిర్వాహకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి నామోజీ వీరాచారి, బాల సాహితీవేత్త గద్వాల సోమన్న, వీత్రీ ఛానల్, విశ్వంభర పత్రిక సంపాదకులు డాక్టర్ కాచం సత్యనారాయణ  రచయితల మీదుగా సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.