calender_icon.png 15 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

15-11-2025 12:16:14 AM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల లో ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొ బి.చంద్రమౌళి అధ్యక్షతన, కళాశాల గ్రంథపాలకుడు డా. బి.యుగంధర్ ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్రవిడియన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డా.ఎం. అంజయ్య పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగ సాధన, వ్యక్తిత్వ వికాసం, అన్ని సబ్జెక్టులపై పరిపూర్ణ జ్ఞానం అత్యంత ఆవశ్యకం అని దీనికి పుస్తక పఠనం, దిన పత్రికలు, మాగజైన్ లు, జర్నల్స్ నిత్యం చదవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ప్రోత్సహిస్తూ తనవంతు సహాయంగా సివిల్స్, గ్రూప్స్, మిగిలిన అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే అత్యంత విలువైన పుస్తకాలను, రిఫరెన్స్  గ్రంథాలను కళాశాల గ్రంథాలయానికి అందజేస్తానని హామీ ఇచ్చారు.