calender_icon.png 15 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగితాల్లోనే ప్లాస్టిక్ నిషేధం?

15-11-2025 12:16:05 AM

  1. నిషేధం ఒట్టి మాటేనా?

ఎక్కడా కనిపించని కట్టడి

విచ్చల విడిగా కవర్లు, వస్తువులు వినియోగం

యదేచ్ఛగా విక్రయాలు 

నియంత్రించడంలో మున్సిపాలిటీల నిర్లక్ష్యం

మణుగూరు, నవంబర్ 14,(విజయక్రాంతి) :పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూ తంగా మారింది. ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటితో చేసిన వస్తువుల విక్రయం, వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. దీంతో జనరోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారింది.

పాలు, కూరగాయలు, టీ, టిఫిన్, భోజనం.. ఏది తేవాలన్న ప్లాస్టిక్ కవర్లు కావాల్సిందే. ప్లాస్టిక్ లేనిదే ఏ సరుకు తెచ్చుకోలేని పరిస్థితి. ప్లాస్ట్పి నిషేధం విధించినా.. అవగాహన కల్పించినా మణుగూరు మున్సిపాలిటీలో ఫలితం శూన్యం. ఇబ్బడి ముబ్బడిగా వాడ డం. తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయ డంతో పట్టణంలో చెత్తకుండి, నాలాలు సైతం పాలిథీన్ కవర్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నా యి. దీనిపై విజయక్రాంతి కథనం..

నిషేధం.. కాగితాల్లోనే పదిలం..

జిల్లావ్యాప్తంగామణుగూరు మున్సిపాలిటీలతో పాటు గ్రామాలలో పెద్ద ఎత్తున ప్లా స్టిక్ వినియోగం జరుగుతోంది. ప్లాస్టిక్ కవ ర్లు, వస్తువులను వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయి స్తుండగా, వినియోగదారులు సైతం వాటిని విరివిగా వాడుతున్నారు. ప్రతిరోజు చెత్త సేకరణలో సగాని కంటే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులే లభిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు వ స్తున్నాయని ప్రజలకు తెలిసినప్పటికీ అనివార్యంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులను వాడుతున్నారు. తద్వారా ప్రజలు క్యాన్సర్ తో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా...

మున్సిపల్ పరిధిలో పదుల సంఖ్యలో హోల్ సేల్ ప్లాస్టిక్ విక్రయషాపులు ఉన్నా యి. వాటి నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను మాత్రమే విక్రయించాలి. కానీ కొందరు వ్యాపారులు 120 మైక్రాన్ల మందం ఉన్నట్లు నకిలీ ముద్రను వేసి మరీ కవర్లు యథేచ్చగా విక్రయిస్తు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు అధికారు ల అండదండలతో ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలు స్తోంది. ఇలా ప్రతీ రోజు దుకాణాల నుండి కేజీల కొద్దీ ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నయి.

పట్టించుకోని అధికారులు....

పట్టణంలోని చేపల మార్కెట్ రోడ్, ప్రధాన రహదారిపై ఉన్న హోల్సేల్ షాపులలో పెద్దమొత్తంలో ప్లాస్టిక్ విక్రయాలు జరుగు తున్నాయి. ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు, మ టన్ షాపులు, చికెన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కూరగాయల విక్రయ వ్యా పారులకు, కిరాణ షాపులకు సప్లయి ఆవుతు న్నాయి. అడ్డగోలుగా ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నా ఏ అధికారి కన్నెత్తి చూడకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొంతమంది మున్సిపల్ సిబ్బంది ఆయా హోల్సేల్ దుకాణాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న అభియోగాలు సైతం ఉన్నా యి. సింగిల్ యూజ్ బ్యాగులు వాడాలని సిబ్బంది అవగాహన కల్పించకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా మారింది. గ తంలో మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. దుకాణాలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా ఫైన్లు వేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకంపై ఉ క్కుపాదం మోపేవారు.

దీంతో అపట్లో కొంత మేరకు నియంత్రణ జరిగింది. అయి తే అప్పటి అధికారులు, సిబ్బందికి బదిలీలు కావడంతో తనిఖీలు నిలిచిపోయాయి. దీం తో పరిస్థితి ఎప్పటి లాగే తయారైంది. అయితే కొన్ని దుకా ణాలలో వ్యాపారులు ప్లాస్టిక్కు దూర మంటున్నారు. తమ కొనుగోలుదారులకు పేపర్ కవర్లు, క్లాత్ సంచుల్లో మాత్రమే వస్తువులను ఇస్తూ పర్యావరణ పరిరక్షణ కు కృషి చేస్తున్నారు.

ఓమటన్ షా పు యజమాని ప్లాస్టిక్ బ్యాన్ చేశాడు. కస్టమర్లు బాక్స్ తెచ్చుకోవాలని బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇలా ప్రతి షాపు యజమాని ఉండాలన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇకనైనా అధికా రులు మేలుకొని ప్లాస్టిక్ కవర్ల విక్ర యాలను కట్టడి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

ముమ్మర తనిఖీలు నిర్వహిస్తాం..

ప్లాస్టిక్ వినియోగం పై చర్యలు చేపడతాం. వ్యాపారులకు అవగాహన క ల్పిం చేందుకు ప్రచారం నిర్వహిస్తాం. వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. అయినా విక్రయాలు ఆపకుంటే ముమ్మర తనిఖీలు నిర్వహి స్తాం. ఇందు కోసం అవసర మైతే ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేస్తాం.

  ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ మణుగూరు