calender_icon.png 7 May, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

07-05-2025 12:26:39 AM

సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కవితాదేవి 

జహీరాబాద్, మే 6: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జహీ రాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి,  లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి.కవితా దేవి అన్నారు. మంగళవారం నాడు జహీరాబాద్ కోర్టు ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గం దొరుకుతుందని ఆమె తెలిపారు.

రాజీ మార్గమే రాజ మార్గమని వివిధ కేసులలో ఉన్నవారు ఈ లోక అదాలత్ సద్వినియోగం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆమె సూచించారు. లోక్ అదాలత్ గురించి ఏదైనా సమాచారం కావాలన్నా మండల తహసిల్దార్, న్యాయవాదులను, పోలీసు ఉన్నతాధికారులను, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాలలో సంప్రదించి సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు.