07-05-2025 12:25:34 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఏ పావని వినయ్‌కుమార్
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): బస్తీల్లో మంచినీటి లోప్రేషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో జలమండలి కార్యాలయం ఎదుట స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపతాం ఆమె హెచ్చరించారు.
గాంధీనగర్ డివిజన్‌లో ఈ మధ్య కాలం లో విపరీతంగా మారిన మంచినీటి లో ప్రెషర్ సమస్య తీవ్రతపై అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్, బీజేపీ శ్రేణులతో కలిసి వాల్మీకి నగర్ బస్తి, వీవీగిరినగర్ బస్తి, ఎస్‌ఆర్‌టీ, తదితర బస్తీ ల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి మంచినీటి సమస్యను అడిగి తెలుసుకున్నా రు. జలమండలి అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ సమస్య తీవ్రతను వివరించారు.
ఇది వరకే పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సమస్యను వివరించినా ఎందుకు పరిష్కరించడం లేదని అధికారులను ప్రశ్నించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత జలమండలి అధికారులదని, వెంటనే మంచినీటి లోప్రెజర్ సమస్యను పరిష్కరించకుంటే భాధిత ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కార్పొరేటర్ హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, వీఎస్‌టీ రాజు, మహమూద్, సత్తిరెడ్డి, ప్రకాష్‌యాదవ్, నర్సింహ, సాయికుమార్, నీరజ్, బస్తి వాసులు, అధికారులు పాల్గొన్నారు.