calender_icon.png 7 May, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే ఎన్నికల్లో ఖైరతాబాద్ అన్ని డివిజన్లలో కాంగ్రెస్‌దే విజయం

07-05-2025 12:27:27 AM

-నేడు హిమాయత్‌నగర్  డివిజన్ బూత్ కార్యదర్శుల సమావేశం 

-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజు యాదవ్ 

ఖైరతాబాద్, మే 6 (విజయక్రాంతి): రాబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్‌లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజు యాదవ్ తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు డివిజన్ స్థాయి నుంచి తాము విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆరు డివిజన్ల ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా చేయడమే తమ లక్ష్యం అని అన్నారు.

కార్పొరేటర్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అధిష్టాన నిర్ణయం మేరకు పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేత కార్యక్రమంలో భాగంగా బుధవారం సోమాజిగూడలోని మెర్కురి హోటల్లో హిమాయ త్‌నగర్ డివిజన్ కార్యదర్శిల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాలస్వామి హాజరవుతారని తెలిపారు. బూత్ సెక్రటరీలు అంద రూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాసిర్, గోకుల కళ్యాణ్, శ్రీరామ్, యాసీన్ తదితరులు పాల్గొన్నారు.