బీసీ రక్షణ చట్టం కోసం జాతీయ స్థాయిలో ఒత్తిడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా బీసీ ప్రతినిధుల బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అతవాలేను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీసీ వర్గాలకు సంబంధించిన కీలక సమస్యలు, దీర్ఘ కాలిక డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించటం జరిగిందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంలు బుధవారం వెల్లడిం చారు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించడం, ఉద్యోగాలు, విద్యా రంగంలో రిజర్వే షన్లు మాత్రమే కాకుండా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని మం త్రికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ ప్రతినిధులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డిమాండ్లపై కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే సానుకూలంగా స్పం దిస్తూ బీసీ వర్గాల సమస్యలను కేంద్ర స్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.




