2 April, 2026 | 3:23 AM

ప్రభుత్వమే చికెన్ ధరలను నిర్ణయించాలి

02-04-2026 01:23 AM
  1. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
  2. చికెన్ విక్రయాల్లో తమ మార్జిన్ పెంచాలి
  3. రాష్ట్ర రిటైలర్ చికెన్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు
  4. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో చికెన్ దుకాణదారుల ధర్నా

ముషీరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): కార్పొరేట్ వ్యవస్థ వలన రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్స్ నడిపేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం కార్పొరేట్ సంస్థలను కట్టడి చేసి ప్రభుత్వమే చికెన్ ధరలను నిర్ణయించాలని, వ్యా పారస్తుల మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశా రు.

ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర రిటైలర్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచా లని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు మద్దతుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు హాజరై మద్దతు తెలిపిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చికెన్ దుకాణాలు నడుపుతున్న వ్యాపారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రిటైలర్ చికెన్ షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ యజమానులు రిటైల్ దుకాణా లకు కిలో మీద 26 మార్జిన్ ఇచ్చేవారన్నారు. దానిని పెంచకపోగా ఇటీవల ఏకం గా 16కి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయమన్నారు. మార్జిన్ను కిలోకు రూ.36 కి పెంచాలని, అప్పటి వరకు దుకాణాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. షాప్ కిరాయి, నిర్వహణ ఖర్చులు, పనిచేసే బాయ్స్ జీతాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినందున కంపెనీలు ఇచ్చే మార్జిన్ ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా మార్జిన్ పెంచాలని అడుగుతున్న కంపెనీలు పట్టించుకోవడం లేదని దీనితో చేసేదేం లేక షాపులు క్లోజ్ చేసి ధర్నా చేస్తున్నామన్నారు. కార్పోరేట్ వ్యవస్థ నుంచి రిటైలర్ వ్యవస్థను మార్చి ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వము చికెన్ ధరలను నిర్ణయిస్తే ప్రజలకు అనుకూలమైన రేటుకే చికెన్ లభిస్తుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో తేలంగాణ రాష్ట్ర రిటైలర్ చికెన్ షాప్స్ అసోసియేషన్ నాయకులు వరుణ్ యాదవ్, శేఖర్ గౌడ్, నాగరాజు, వి.కిరణ్, విజయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.