calender_icon.png 9 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌ను కలిసిన ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు

27-05-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 26(విజయక్రాంతి): తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇటీవల ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జిల్లా కార్యవర్గం ఏర్పాటు అయిన సందర్భంగా కలెక్టర్‌తోపాటు సంబంధిత జిల్లా అధికారులను కలిశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కాంబ్లే సుభాష్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి దేవిదాస్, ఉపాధ్యక్షుడు డి.రమేష్, కార్యదర్శి సురేష్ ఉన్నారు.