10-11-2025 12:19:49 AM
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వివిధ విత్తనాల పిండి సంభారత మందుల కంపెనీలలో పనిచేసే మార్కెటింగ్ ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నగేష్, ఉపాధ్యక్షుడిగా అనిల్, కోశాధికారిగా ప్రణయ్, కార్యదర్శిగా నాగరాజులను ఎన్నుకున్నారు. మార్కెటింగ్ రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ఆర్థిక ఇబ్బందులను చేరుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని సమావేశంలో తీర్మానించారు. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలలో పనిచేస్తున్న తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలని తీర్మానం చేసుకున్నారు.