calender_icon.png 30 January, 2026 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

04-10-2024 12:00:00 AM

మహబూబ్‌నగర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా నవరాత్రి ఉత్స వాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే దేవీ నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా భక్తులు అమ్మవారి అలయల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ పరిధిలోని దేవీ నగర్ శ్రీకాళికాదేవి ఆలయంలో కలశ స్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారు గురువారం ఉమాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా రావడంతో ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన సదుపాయాలను కల్పించారు.