calender_icon.png 1 July, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

01-07-2025 12:16:36 AM

-అధ్యక్షుడిగా మల్లేష్ బొడ్డుపల్లి, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం 

నాగర్ కర్నూల్ జూన్ 30 (విజయక్రాంతి); తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజేయు)నాగర్ క ర్నూల్ టౌన్ కమిటీని రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం అనంతరం పట్టణ అధ్యక్షులుగా మల్లేష్ బొడ్డుపల్లి, కార్యదర్శిగా శ్రీశైలం ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులను రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అభినందించారు.

యూనియన్ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి. తాలూకా అధ్యక్షుడు సందు యాదగిరి, కార్యదర్శి సాయిలు సాగర్ ఉపాధ్యక్షుడు రాంప్రకా ష్, కార్యనిర్వహక కార్యదర్శి మహ్మద్ దర్వేష్ సీనియర్ పాత్రికేయులు పి.విజయ్ గౌడ్ , వెంకటస్వామి, కొండకింది మాధవరెడ్డి, కంది కొండ మోహన్‌తో పాటు ఇతర తాలూకా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.