01-07-2025 05:30:11 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లి ఏఎంసి ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు కోసం అధికారులు చేస్తున్న మార్కింగ్ పనులు సాగుతున్నాయి. మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Municipal Commissioner Thanniru Ramesh) రోడ్డు విస్తరణ మార్కింగ్ పనులను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం నుండి కాంటా చౌరస్తా వరకు రోడ్డు వేడల్పు పనులు చేపట్టిన ఉన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు మార్కింగ్ పనులను మున్సిపల్ కమిషనర్ పన్నీర్ రమేష్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, టిపిబిఓ లు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.