calender_icon.png 2 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులతో రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

01-07-2025 05:23:46 PM

చనాక కొరటా బ్యారేజ్ పెండింగ్ పనులను పరిశీలించని మంత్రులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం సమంజసం కాదని జైనథ్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిడుగు స్వామి యాదవ్(BRS Party Leader Pidugu Swami Yadav) అన్నారు. గత ఎంపీ ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు వేసి, మళ్లీ రెండు విడతలు ఎగగొట్టి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు వేయడాన్ని రైతులు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రైతు వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనథ్ లోని పలువురు రైతులను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించి వారికి రైతు వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పిడుగు స్వామి మాట్లాడుతూ... ఆరుగాలం కష్టపడే రైతన్నను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని, రైతులకు కనీసం రైతుభరోసా, రైతు బీమాకు దూరం చేసింది అన్నారు. చనాక కొరటా బ్యారేజ్ నిర్మాణంతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా మాజీ మంత్రి జోగు రామన్న కృషి చేయగా, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ఇద్దరు మంత్రులు పెండింగ్ పనులను పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. పెండింగ్ లో ఉన్న 20 శాతం పనులను పూర్తిచేస్తే సాగునీరు అందుతోందన్నారు. కానివారి నిర్లక్ష్యం చేస్తే  రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చన్నారు.