calender_icon.png 2 July, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం..

01-07-2025 04:53:20 PM

రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా మారుస్తాం..

కరీంనగర్ ను అభివృద్ధిలో ముందు ఉంచుతాం..

ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నిధులు మంజూరు చేయిస్తా.. 

నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి..

మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలి..

ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి..

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(Parliament Constituency In-Charge Velchala Rajender Rao) పేర్కొన్నారు. నగరాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతామని, రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai)ని మున్సిపల్ కార్యాలయంలో వెలిచాల రాజేందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజేందర్ రావు వెంట మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు శాలువాతో కమిషనర్ ను సన్మానించారు. అనంతరం కరీంనగర్లో అభివృద్ధి పనులు.. పెండింగ్లో ఉన్న పనులు, తాగునీటి సరఫరా, డంపింగ్ యార్డ్ సమస్య, శానిటేషన్, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తో రాజేందర్ రావు మాట్లాడారు.