01-07-2025 04:56:11 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు..
మునుగోడు (విజయక్రాంతి): సమాజం యొక్క సంక్షేమం, శ్రేయస్సుకు వైద్యులు అపారమైన కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు(Congress Party Mandal President Bheemanapalli Saidulu) అన్నారు. మండల కేంద్రములోని ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను శాలువాలతో సత్కరించి మాట్లాడారు. సమాజంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించే వైద్యులు దైవ సమానులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని నర్మదా, మంగి భాయ్, అలివేలు, మేఘన, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, జనిగల ముత్యాలు, ఆరేళ్ల సైదులు, పుచ్చపోతుల శ్రీను, దండు లింగస్వామి, తీగల స్వామి, యాదయ్య ఉన్నారు.