21-05-2025 12:00:00 AM
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్
భద్రాచలం , మే 20(విజయ క్రాంతి)ప్రతి విద్యార్థిని చదువు, తనకు నచ్చిన క్రీడలతో పాటు కళల పట్ల కూడా మక్కువ చూపించి మీలోని ప్రతిభను నైపుణ్యాలను పదిమంది గుర్తుంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని కేజీబీవీలో ఈనెల 5వ తేదీ నుండి 15 రోజులు పాటు జరిగిన సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి ద్యార్థినీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదివి ప్ర యోజకులవుతారని అనే నమ్మకముతో ఉంటారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్ప నిసరిగా మీరంతా బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించేది విద్యా ర్థినిలలో వారిలో దాగివున్న ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీసి వారిని ఉత్తములుగా తీర్చిది ద్దడానికన్నారు. కష్టమైన పనినైనా ఇష్టంగా ఎలా చేస్తామో అలాగే చదువులో కూడా ముం దుండాలన్నారు.
ఈ 15 రోజులు సమ్మర్ క్యాంపులో జిల్లాలోని కేజీబీవీ లో చదివే విద్యార్థినిలు మీరు చదివే సబ్జెక్టులతో పాటు యోగ, డాన్స్, వివిధ క్రీడలు మరియు కుట్లు, అల్లికలు, కంప్యూ టర్ శిక్షణ ఆరట్స్ అండ్ క్రాఫ్ట్ శిక్షణలు తీసుకున్నందున తప్పనిసరిగా వాటిని అశ్రద్ధ చేయకుం డా ప్రతిరోజు మీ ఇంటి వద్ద రిహర్షల్ చేస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర చారి, ఎంఈఓ రమ, కొత్తగూడెం జి సి డి వో అన్నామని విద్యార్థినీలు పాల్గొన్నారు.