calender_icon.png 25 May, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విద్యావిధానంపై అవగాహన ఉండాలి

21-05-2025 12:00:00 AM

ఎంఈవో ఇమ్మానుయేల్ 

పెంట్లవెల్లి మే 20: మండలంలోని ప్రతి ఉపాధ్యాయుడు నూతన విద్యా విధానంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెంట్ల వెల్లి మండల విద్యాశాఖ అధికారి ఇమ్మాను యేలు ఉపాధ్యాయులకు సూచించారు. మం గళవారం మండలంలోని జిల్లా పరిషత్ బా లుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఆయన సంద ర్శించి మాట్లాడారు.

కొత్త విద్య విధానాన్ని విద్యార్థులకు సులభతరంగా అందించే విధానాన్ని నేర్చుకొని విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ బడులు బలోపేతం కావడానికి ఈ ఐదు రోజుల ట్రైనింగ్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరకు  తీసుకువెళ్లాల్లి వాళ్లను చైతన్య పరచాలన్నారు. బడులు తెరిచే రోజున విద్యార్థులతో ప్రతి పాఠశాల కళకళలాడాలని ఆదేశించారు.