calender_icon.png 10 October, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల పట్ల నిర్లక్ష్యం తగదు

10-10-2025 06:31:14 PM

మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్ 

నకిరేకల్,(విజయక్రాంతి): వసతి గృహ సంక్షేమ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగదని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల పాఠశాల, కళాశాల వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహాలలో విద్యార్థులకు మెనూ సక్రమంగా పాటిస్తున్నారా... లేదా... అన్నది అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడారు.  నిలువ గదులలో ఉన్న బియ్యాన్ని, నిత్యవసరాలను చూసి రికార్డులు పరిశీలించారు. ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల హెచ్ డబ్ల్యూ ఓ భానుచందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ బాలికల ఏబి కళాశాల వసతి గృహ సంక్షేమ అధికారులు విధులకు హాజరు కాకపోవడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. వారి వెంట హెచ్ డబ్ల్యూఓలు యాదగిరి, భానుచందర్, డి.శ్వేత, సిబ్బంది ఉన్నారు.