calender_icon.png 10 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వాట... మాకు ఇవ్వాలి

10-10-2025 06:38:47 PM

నల్గొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము ఏంతో మావాట... మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం బీసీలకు 42 శాతం కల్పిస్తూ జీవోలు చేసి  ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని కొన్ని అగ్రవర్ణాల శక్తులు కోర్ట్ లో కేసులు వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు

 రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులో కేసులు లకు ఎలాంటి చిక్కులు లేకుండా న్యాయ పరంగా పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయాలని  కోరారు. ఈ రాష్ట్రం లోపల 60 శాతానికి పైబడి ఉన్న బీసీలు 42 శాతానికి అంగీకరించినప్పటికీ కూడా మా ఫలాలను అడ్డుకోవడం ముమ్మాటికీ ఆధిపత్య శక్తులు మా ఎదుగుదల ను జిర్నిచ్చుకోలేక పోయారని  అన్నారు. న్యాయబద్ధంగా మాకు దక్కాల్సిన వాటా కోసం మాత్రమే పోరాడుతున్నామన్నారు. ఇందిరా సహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50 శాతం పరిమితి దాటోద్దని ఉందని పదేపదే న్యాయ వ్యవస్థ మందు ఉంచుతున్నారని, ఇదే ఆదిపత్య శక్తులు ఇదే బిజెపి ప్రభుత్వం ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా 2022లో 103 వ రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని ఉల్లంఘించి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు పొందారని ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నిచారు. భారత రాజ్యాంగంలోనూ చట్టంలోను ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ల పరిమితి దాటోద్దని పేర్కొనలేదన్నారు. 2022లో జనహిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈడబ్ల్యూఎస్  కోటాలో 10 % పెంచడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పిటీషన్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినప్పుడు ఆనాటి బిజెపి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ 50 శాతం పరిమితి అనేది సాధారణ నియమం మాత్రమే కానీ చట్టంలో ఎక్కడ పేర్కొనబడలేదని చెప్పారు. అదేవిధంగా చండ్రచూడు ధర్మాసనం రిజర్వేషన్ల విషయంలో తీర్పునిస్తూ 50 శాతం రిజర్వేషన్ అనేది సాధారణ నియమం మాత్రమే కానీ దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పిందన్నారు.