calender_icon.png 10 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మావతి

10-10-2025 07:00:51 PM

సురేష్ బాబు పాడేమోసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

చిలుకూరు: మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు ఎనిమిదో తారీకు బుధవారం సాయంత్రం 6:30 సమయంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. శుక్రవారం ఆయన పార్థివ దేహానికి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన లేని లోటు వారి కుటుంబానికి తీర్చలేమని ఆయన కుటుంబానికి ప్రగాఢకు సానుభూతిని తెలియజేశారు. సురేష్ బాబు పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, సురేష్ బాబు పార్థివ దేహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్లయ్య యాదవ్, అనంతక్రియలు పాల్గొని ఆయన పాడే మోశారు.

ఈ సందర్భంగా ఆయనతో ఉన్న సానిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం యుద్ధం చేసిన మహోన్నత వ్యక్తి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు దొడ్డ సురేష్ బాబు, అని ఆయన మన మధ్య లేడు అనే ఆలోచన జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం చిలుకూరులో ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు విద్యావంతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.