10-10-2025 07:05:43 PM
నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను తక్షణమే ఉపసంహారించుకోవాలని బిజెపి జిల్లా నాయకులు గున్నాల నాగరాజు డిమాండ్ చేసారు. ఉపసంహారించుకోకపోతే పెద్ద ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి విపరీతంగా బస్ చార్జీలని పెంచి సామాన్య మధ్య తరగతి వర్గాల ప్రజలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతుందని అయన ధ్వజమెత్తరు.పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జిల వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అయన ఆవేదన వ్యక్తం చేశారు.