23 March, 2026 | 5:21 AM

రజక సంఘం నూతన కార్యవర్గం

23-03-2026 12:07 AM

మనోహరాబాద్, మార్చి 22: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ రజక సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా రజక సంఘం అధ్యక్షుడుగా నేతికుంట బాలేష్, గౌరవ అధ్యక్షులు నేతికుంట వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నేతికుంట కిరణ్ బాబు, ఉపాధ్యక్షులు నేతికుంట శ్రీనివాస్ రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు మాట్లాడుతూ మాకు ఇచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని కాపాడుకుంటూ రజక సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మా మాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని ఎక్కడ భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో ముందుకు కొనసాగుతామని అన్నారు ఇందులో నేతికుంట గణేష్, శివరాం, సురేష్ లు తదితర సభ్యులు పాల్గొన్నారు.