420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
కొల్చారం, మార్చి 22 : నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృషితో మంజీరా పరివాహక ప్రాంతంతో పాటు... గన్ పూర్ ఆయకట్ట కింద సాగు చేసిన మొ త్తం లక్ష ఎకరాల పంటకు నీటి విడుదల జ రుగుతుందని అందుకు రైతాంగం తరఫున... బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చారం మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌడ్ శంకర్ గుప్తా, సి డి సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ తెలిపారు.
మండల కేంద్రమైన కొ ల్చారంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల విషయం లో రైతులు పంటలు సాగు చేయకు ముందే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతు లు పంటలు సాగు చేశాక సింగూర్ ప్రాజెక్టు మరమ్మత్తుల దృష్ట్యా నీటిని కిందికి వదిలిపెట్టి పనులు చేస్తామని ప్రకటించి రైతులను అయోమయానికి గురి చేశారన్నారు.
కాం గ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు... 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని రైతులను నానా గోస పడేవిధంగా చేస్తుందన్నారు. రైతు బంధు అంటే కేసీఆర్ ... కెసిఆర్ అంటే రైతుబంధు అని రైతులకు పెట్టుబడి సహాయం, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన కెసిఆర్ కు ఎవరు సాటి రారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వేమారెడ్డి, కరెంటు రాజా గౌడ్, సర్పంచులు వినోద్ నాయక్, స్వామి, మహేష్, రమణ, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు, మాజీ సర్పంచులు చిట్యాల యాదయ్య, ఆశన్న గారికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.




