వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు ఎంతో అవసరం
- రాష్ట్రంలో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్‌కు చర్యలు తీసుకున్నాం
- పుస్తకావిష్కరణలో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
సంగారెడ్డి, మే 6 (విజయక్రాంతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డిలోని తన నివాసంలో ప్రముఖ ఓరల్, మ్యాక్సిలోఫాసియాల్ నిపుణులు డాక్టర్ చిత్తలూరి లక్ష్మణ్ రాయ్ రచించిన ’వివా అండ్ క్లినికల్ గైడ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు ఎంతో అవసరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేష న్‌కు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణలో చదువుకున్న వైద్య విద్యార్థులకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. తెలం గాణ ప్రభుత్వం వైద్య విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
డాక్టర్ చిత్తలూరి లక్ష్మణ్ రాయ్ రచించిన ఈ పుస్తకం వర్ధమాన డెంటల్ డాక్టర్లకు క్లినికల్ గైడ్‌గా ఉపయోగపడుతుందన్నారు. పుస్తక రచయితను మంత్రి అభినందించారు. జాతీయ డెంటల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సుధీర్ రామ్ శెట్టి పాల్గొన్నారు.






