calender_icon.png 28 June, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిగ్ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం

28-06-2025 01:53:15 AM

- దేశానికే రోల్ మోడల్ అయ్యేలా అమలు చేస్తాం

- కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల కోసం అత్యుత్తమ చట్టాన్ని రూపొందిస్తామని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపా రు. తెలంగాణ గిగ్ వర్కర్ల పాలసీని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

గిగ్ వర్కర్ల సమస్యలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి నుంచి సూచనల గురించి వివరించారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారని, వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి హ క్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం గతంలోనే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిందని, ఆ తరహాలోనే తెలంగాణలో కూడా గిగ్ వర్కర్ల కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. యాజమాన్యాలు, గిగ్ వర్కర్ల నుంచి 66 సూచనలు, సలహాలు వచ్చాయని, వాటిపై చర్చించి ఎలాంటి సహాయం చేయాలన్న దానిపై త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామని వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే గిగ్ వర్కర్లతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. గిగ్ వర్కర్ల పాలసీపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి, వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు ఆమోదిస్తామని తెలిపా రు. బిల్లులో 1 లేదా 2 శాతం సెస్ పెట్టడానికి, బోర్డు ద్వారా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారని, కొత్త యాక్ట్ వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.