calender_icon.png 17 December, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుడా చైర్మన్ ను కలిసిన నూతన సర్పంచులు

16-12-2025 07:08:38 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని సుడా కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుడా కార్యాలయానికి వచ్చిన సర్పంచులను నరేందర్ రెడ్డి శాలువాలతో సత్కరించి మిఠాయి తినిపించారు. జిల్లా మంత్రుల సహకారంతో సుడా నిధులతో అభివృద్ధి పనులు చేపడుదామని, ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటానని ఎప్పుడైనా మా వద్దకు రావచ్చని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నరేందర్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య, దుబ్బపల్లి సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి, ఏలబోతారం సర్పంచ్ తప్పట్ల రాజు, జూబ్లీనగర్ సర్పంచ్ కమలాకర్, ఫకీర్ పేట్ సర్పంచ్ బొద్దుల విజయలక్ష్మి లక్ష్మీనారాయణ, బహదూర్ఖాన్ పేట్ సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతి రెడ్డి, దుబ్బపల్లి ఉప సర్పంచ్ అల్వాల శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాంరెడ్డి రాంరెడ్డి, వేల్పుల రవీందర్ రావు, మీసాల సాయిలు, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.